మేడ్చల్ జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ నగరపాలికల్లో 26, 28 స్థానాలకు... ఘట్కేసర్ పురపాలికలో 18, పోచారం పురపాలికలో 16 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు ఓటర్లు చేరుకుంటున్నారు.
బందోబస్తు మధ్య మేడ్చల్ జిల్లా పుర పోలింగ్ - బోడుప్పల్ పోలింగ్ 2020
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ, బోడుప్పల్ నగరపాలికలు, ఘట్కేసర్, పోచారం పురపాలికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు.

బోడుప్పల్ పురపాలక ఎన్నికల పోలింగ్
బోడుప్పల్ పురపాలక ఎన్నికల పోలింగ్
కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్