మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. వీరికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న భాజపా నేత కూన శ్రీశైలం గౌడ్‌తోపాటు, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
భాజపా, కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్ - భాజపా నేత కూన శ్రీశైలం గౌడ్ తాజా వార్తలు
జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. వీరికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న భాజపా నేత కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అధిక ధరలను వ్యతిరేకిస్తూ బంకుల వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భాజపా, కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్
మరో వైపు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కుత్బల్లాపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనకు సిద్ధమయ్యారు. పెట్రోల్ బంకుల ముందు ఆందోళన చేపట్టేందుకు వేళ్తున్న హస్తం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జీడిమెట్ల పీఎస్ తరలించారు.
ఇదీ చదవండి:ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్ మ్యాన్