భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యుల భూముల వ్యవహారం(etela rajender land grabbing case)లో నిష్పక్షపాతంగా సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. అచ్చంపేట, హకీంపేట భూములను ఆయన పరిశీలించారు. సర్వే ఇంకా కొనసాగుతోందని.. హద్దురాళ్లు తొలగించడం వల్లే సర్వే ఆలస్యమవుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఏప్రిల్‌లో అందిన ఫిర్యాదు మేరకే సర్వే చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీనిపై జమున హేచరీస్ వాళ్లు కోర్టును ఆశ్రయించారని(etela rajender land grabbing case) ఆయన వివరించారు. సర్వేలో సీలింగ్ ల్యాండ్, అసైన్డ్ భూములు, పట్టా భూమి ఎంత ఉందో కచ్చితంగా లెక్క తేలుస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.
హద్దురాళ్లు తొలగించడం వల్ల సర్వే ఆలస్యం అవుతోంది. ఏప్రిల్‌లో అందిన ఫిర్యాదు మేరకు సర్వే చేస్తున్నాం. సర్వేకు అందరూ సహకరించాలి. సీలింగ్‌ల్యాండ్, అసైన్డ్ భూముల లెక్క తేలుస్తాం. సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. నిష్పక్షపాతంగా సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తాం. -హరీశ్, మెదక్ కలెక్టర్
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని జమున హేచరీస్(jamuna hatcheries lands)కు చెందిన భూముల్లో మూడో రోజు ఆరుగురు సర్వేయర్లతో సర్వే నిర్వహించారు. సర్వే నంబరు 77 నుంచి 82 వరకు ఉన్న భూముల సర్వే పూర్తయిందని మాసాయిపేట తహసీల్దార్ మాలతి తెలిపారు.
ఆక్రమణలు జరిగాయని గతంలోనే నివేదిక
మెదక్ జిల్లా(medak district news) మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించారని(land grabbing allegations on etela) ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్(Etela rajender) హేచరీల(Jamuna Hatcheries)తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అప్పట్లో కోర్టుకెళ్లిన ఈటల
అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు(Telangana High court)ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.
154మందికి నోటీసులు
కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు భూముల సర్వేకు సన్నద్ధం అయ్యారు. సర్వే(MLA Etela land survey)కు రావాలంటూ ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డితో పాటు మరో 154మందికి ఈ నెల 8తేది నోటీసులు ఇచ్చారు. జమున హేచరీస్(jamuna hatcheries lands)కు చెందిన గోడలకు నోటీసులు అతికించారు. 16, 17, 18 తేదీల్లో భూముల సర్వే చేయనునున్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. తూప్రాన్ డివిజన్ ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగుతోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:Congress Dharna: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి'