మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్వామి(30) వరినాట్ల కోసం వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా... రైతు మృతి - మెదక్ జిల్లా వార్తలు
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి స్వామి అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి
డ్రైవర్ స్వామి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్వామి మృతితో ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: పాము కాటుతో అన్నదాత మృతి