కరోనా వ్యాధికి మందు వచ్చే వరకు ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి, నర్సాపూర్‌లలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వైరస్ కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.
నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేసిన మంత్రి హరీశ్
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి, నర్సాపూర్‌లలో మంత్రి హరీశ్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేసిన మంత్రి హరీశ్
వైరస్ సోకిన వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చివరి చూపు కూడా దక్కదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పెన్షన్లు, ప్రతినెలా బియ్యం, నగదు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం