తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్' ను ప్రారంభించిన కలెక్టర్​ - corona virus update news

మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో తెలంగాణ ఇన్పర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్​ వారు ప్రవేశపెట్టిన 'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్​'ను జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్​ డాక్టర్లను పేషెంట్లను కలుపుతుందని... లాక్‌డౌన్‌ సమయంలో ఈ యాప్ ద్వారా ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చని తెలిపారు.

medak collector inaugurated t-consult tele medicine
'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్' ను ప్రారంభించిన కలెక్టర్​

By

Published : May 4, 2020, 7:32 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు 'టీ కన్సల్ట్ టెలీ మెడిసిన్' ప్రవేశపెట్టారు. దానిని ఈరోజు మెదక్ కలెక్టరేట్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్​ డాక్టర్లను పేషెంట్లను కలుపుతుందని... లాక్‌డౌన్‌ సమయంలో ఈ యాప్ ద్వారా ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా... నలుగురు పూర్తిగా కోలుకున్నారని మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తెలిపారు. వారిని డిశ్చార్జి చేయడం జరిగిందని.. ఇంకా ఒక వ్యక్తి త్వరలో కోలుకొని డిశ్చార్జ్ అవుతాడనిపేర్కొన్నారు. ఆరెంజ్ జోన్​ నుంచి గ్రీన్ జోన్​లోకి మెదక్ జిల్లా మారే అవకాశముందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బయటనుంచి వచ్చిన వ్యక్తులు గాని, ఇంకా ఇతర సమస్యలు ఉంటే కలెక్టరేట్​లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08452-223360కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.

ఇవీ చూడండి: గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ABOUT THE AUTHOR

...view details