తెలంగాణ

telangana

ETV Bharat / state

చివరి రోజు భారీగా నామినేషన్లు - latest news on third day nominations

పురపాలక ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడం వల్ల మున్సిపల్​ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నర్సాపూర్​ మున్సిపాలిటిలో చివరిరోజు భారీగా నామినేషన్​లు దాఖలయ్యాయి.

heavy nominations at The last day
చివరి రోజు భారీగా నామినేషన్లు

By

Published : Jan 11, 2020, 10:50 AM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీలో శుక్రవారం 88 నామినేషన్‌లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడం వల్ల ప్రధాన పార్టీలు, స్వతంత్రులు భారీగా నామినేషన్‌లు వేశారు.

తెరాస మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్‌ స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలతో కలసి వచ్చి నామినేషన్‌ వేశారు.

అధిష్టానం సూచించిన మేరకు మురళీ యాదవ్‌ను బరిలో నిలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు.

నర్సాపూర్​లో మొత్తంగా ఇప్పటివరకు 145 నామినేషన్లు దాఖలయ్యాయి.

చివరి రోజు భారీగా నామినేషన్లు

ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

ABOUT THE AUTHOR

...view details