మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో నిరుపేదలకు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 1000 విలువైన సరుకులను ఆమె అందజేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా లాక్డౌన్ పాటించాలన్నారు.
నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ జిల్లా రామాయంపేటలోని పేదలకు.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలు కరోనాపట్ల అవగాహన కలిగి ఉండి స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆమె సూచించారు.
నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
అత్యవసర పరిస్థితిలోనే బయటకు వెళ్లాలని అలా వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవాలని... మాస్కులు ధరించాలని పద్మాదేవేందర్రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్