మెదక్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో 30 మందికి రూ.19.8 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నిబంధనల వల్ల సమీప గ్రామాల్లోని లబ్ధిదారులకు మాత్రమే ప్రస్తుతం చెక్కులు అందించామని… మిగతా వారికి తన వ్యక్తిగత సిబ్బంది ఇంటికే వచ్చి అందిస్తారని తెలిపారు. ప్రైవేటులో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు - cm relief fund cheques distributed in medak district
మెదక్లో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ అందించారు. 30 మందికి రూ.19.8 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
ఆపద కాలంలో తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూచన్ పల్లి సర్పంచ్ దేవగౌడ్, మాజీ సర్పంచ్ కిరణ్ గౌడ్, ఉప సర్పంచ్ భయ్యన్న, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?
TAGGED:
మెదక్ జిల్లా తాజా వార్తలు