మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుపేట గ్రామానికి చెందిన పంబళ్ల శేఖర్ జంతు ప్రేమికుడు. తనకు చేతనైనంతలో మూగజీవాలకు సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. బుజ్జి బుజ్జి రెక్కలతో ఆకాశానికి ఎగిరే పక్షులంటే శేఖర్ మరింత మక్కువ ఎక్కువ. వేసవి మొదలైందంటే చాలు.. పక్షుల కోసం గిన్నెల్లో నీళ్లు పోసి.. వాటికి అందుబాటులో ఉంచుతారు. తినడానికి గింజలు వేస్తుంటారు.
పక్షులకు ఆత్మీయుడు.. ఈ శేఖరుడు!
కళ్ల ముందు ఒకరు చావుబతుకుల్లో ఉన్నా కనికరించని ఈ రోజుల్లో సాటివారికి కాస్త సేవ చేయాలనే తపన ఉన్నవారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన పంబళ్ల శేఖర్. వేసవిలో నీరు దొరకక మృత్యువాత పడే పక్షులకు తాగడానికి గుక్కెడు నీళ్లందిస్తూ వాటిపాలిట సంజీవనిగా నిలుస్తున్నారు.
పక్షులకు ఆత్మీయుడు.. ఈ శేఖరుడు!
మూడేళ్ల క్రితం విశ్వమాత గోశాల ఏర్పాటు చేశారు. మూగజీవాలను బంధించి ఉంచకూడదని, వాటికి స్వేచ్ఛ అవసరమని చెబుతున్నారు. పక్షులకు, ఇతర వన్యప్రాణులకు సేవచేయడంలో ఉన్న సంతృప్తి మరి దేంట్లో ఉండదని అంటున్నారు. మూగజీవాల కోసం డబ్బు వృథా చేస్తుంటారని.. తనను పిచ్చివాడని అన్నా.. ఏనాడు వెనుకంజ వేయలేదని తెలిపారు.
- ఇదీ చూడండి :ఔరా: యోగాతో 'పక్షి రాజు' తిరుగులేని సందేశం