తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదాల నివారణపై ఆటోడ్రైవర్ యాత్ర - auto driver awareness on road safty

మెదక్ పట్టణానికి చెందిన షఫీ రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఆటోయాత్ర చేపట్టాడు. పట్టణంతో పాటు మండలవ్యాప్తంగా కొనసాగనున్న ఈ యాత్రను పట్టణ సీఐ వెంకటయ్య ప్రారంభించారు.

ప్రమాదాల నివారణపై ఆటోడ్రైవర్ యాత్ర
ప్రమాదాల నివారణపై ఆటోడ్రైవర్ యాత్ర

By

Published : Jan 4, 2020, 7:00 PM IST

రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది చిన్నారులు అనాథలవుతున్నారు. ప్రమాదాలపై ఎంత అవగాహన కల్పించినా... పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. దీనిపై తన వంతు బాధ్యతగా.. మెదక్​కు చెందిన ఆటో డ్రైవర్ షఫీ వినూత్న రీతిలో అవగాహన చేపడుతున్నాడు. ప్రమాదాలు నివారించేందుకుగాను తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

షఫీ చేపట్టిన ఈ యాత్రను మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య ప్రారంభించారు. వారం రోజులపాటు మెదక్ పట్టణంలో, మరో 20 రోజులు మండలవ్యాప్తంగా కొనసాగనుందని తెలిపాడు. తన ప్రయత్నం వల్ల కొంతమంది రోడ్డు భద్రత నియమాలు పాటించినా... కొన్ని ప్రాణాలు కాపాడినవాడిని అవుతానని షఫీ చెబుతున్నాడు. మహిళా భద్రతలో భాగంగా... అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐ వివరించారు.

ప్రమాదాల నివారణపై ఆటోడ్రైవర్ యాత్ర

ఇదీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details