గ్రామంలో అక్రమ మద్యాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలంటూ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చిన యువకుల పై బెల్ట్ షాపు నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని గంగాయిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన స్వచ్ఛ భారత్ కమిటీ యువకులు తమ గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. దీంతో గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహించే ముగ్గురు వ్యక్తులు మద్య నిషేధంలో కీలక పాత్ర పోషించిన భాస్కర్ అనే యువకునిపై దాడి చేశారు. మరో యువకుడు మహేశ్ ఇంటిపై దాడి చేసి.. వారి కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో మద్యం నిషేధించాలన్న వ్యక్తులపై దాడి - గంగాయిపల్లి
గ్రామంలో అక్రమ మద్యాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలంటూ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చిన యువకులపై బెల్ట్ షాపు నిర్వాహకులు దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
గ్రామంలో మద్యం నిషేధించాలన్న వ్యక్తులపై దాడి