మంచిర్యాల జిల్లాలోని ఊరు మందమర్రి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి పెద్దవాగు వరకు సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గడిచిన వారం రోజుల్లో కోటపల్లి, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరించి పశువులను హతమార్చింది. ఊరు మందమర్రి గ్రామంలో కూడా పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించటం వల్ల స్థానికులు భయపడుతున్నారు.
పెద్దపులి సంచారం... భయాందోళనలో గ్రామస్థులు - tiger
మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రి గ్రామంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది. గ్రామశివారులో ఆనవాళ్లు కనిపించగా గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పులి అడుగులేనని నిర్ధారించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపులి సంచారం... భయాందోళనలో గ్రామస్థులు