మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి సమీపంలో ఇద్దరు యువతీ యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వీరిద్దరూ ద్విచక్రవాహనంపై వచ్చి జాతీయ రహదారి పక్కనే కూర్చొని తమతో పాటు తెచ్చుకున్న శీతల పానీయం, మద్యం సీసాలో పురుగుల మందు కలుపుకొని తాగారు. అక్కడే రోడ్డుపై పడిపోయారు. వీరిని గమనించిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. యువకుడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కారు డ్రైవర్ వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్‌కి ఓ భార్య ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని శ్రీవిద్యగా గుర్తించారు. వీరు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
పెళ్లైంది కానీ.. మరో యువతితో కలిసి ఆత్మహత్య - రసూల్‌పల్లి సమీపంలో ఇద్దరు యువతీ యువకుల ఆత్మహత్య
పురుగుల తాగి ఇద్దరు యువతీయువకులు జాతీయ రహదారి పక్కనే ఆత్యహత్య చేసుకున్నారు.

పెళ్లైంది కానీ.. మరో యువతితో కలిసి ఆత్మహత్య
పెళ్లైంది కానీ.. మరో యువతితో కలిసి ఆత్మహత్య
ఇవీ చూడండి: అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...
TAGGED:
GIRL AND MEN SUICIDE