తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ, పోలీస్ అధికారులతో  ఎస్​హెచ్​ఆర్సీ ఛైర్మన్ సమీక్ష - Hrc_Chairman_Meet

మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ పర్యటించారు. జిల్లాలోని రెవెన్యూ, పోలీస్ అధికారులతో పెండింగ్​ అంశాల గురించి చర్చించారు.

పెండింగ్ అంశాలను ఆరా తీసిన ఎస్​హెచ్​ఆర్సీ ఛైర్మన్
పెండింగ్ అంశాలను ఆరా తీసిన ఎస్​హెచ్​ఆర్సీ ఛైర్మన్

By

Published : Jan 11, 2020, 11:21 PM IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి అతిథి గృహంలో జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులతో మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ చంద్రయ్య సమీక్షించారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన కన్కూర్ గ్రామ అటవీ భూముల విషయంలో అటవీ అధికారులకు, గ్రామస్థులకు జరిగిన వివాదంపై చర్చించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గృహ హింస కేసులపై ఆరా...

నెన్నెల, భీమిని మండలలో జరిగిన భూ వివాదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గృహ హింస కేసుల్లోని పురోగతిని తెలుసుకుని... అధికారులకు పనితీరుపై అవగాహన కల్పించారు. పౌర హక్కులను రక్షించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్ అంశాలను ఆరా తీసిన ఎస్​హెచ్​ఆర్సీ ఛైర్మన్

ఇవీ చూడండి : 'హామీలు నెరవేర్చని తెరాసకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details