తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రిలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ - awareness rally on plastic usage in mandamarri

ప్లాసిక్​ను నిర్మూలించాలంటూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.

awareness rally on plastic Extermination in mandamarri
మందమర్రిలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ

By

Published : Nov 28, 2019, 1:08 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ర్యాలీని పురపాలక కమిషనర్ సుమతి ప్రారంభించారు.

విద్యార్థులు ప్లకార్డులు చేతబూని పాఠశాల నుంచి పాత బస్టాండ్, అంగడి బజార్, స్థానిక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్రీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్​ వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మందమర్రిలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ

ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details