మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పురపాలిక రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఎన్నికల్లో భాజపా తరపు విజయం సాధించిన ఛైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు తెరాసలో చేరారు. మరో సభ్యుడు రామకృష్ణ కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెరాసలో చేరారు.
భూత్పూర్లో 10 వార్డులకు తెరాస 4, భాజపా 4, కాంగ్రెస్ 2 స్థానాలు గెలిచారు. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేనందున... ఆ మున్సిపాలిటీ రాజకీయాలపై అందరికీ ఆసక్తి నెలకొంది.