ఇన్నాళ్లు కోసినా.. కొన్నా.. కన్నీరు తెప్పించే ఉల్లి ధరలు తగ్గడంతో.. కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
పెరుగుతున్న ఉల్లి క్రయవిక్రయాలు.. తగ్గిన ధరలు - cost of onions in mahabubnagar
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉల్లి ధరలను నిర్ణయించే దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు, వినియోగదారులతో కళకళలాడుతోంది. దిగుమతులు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.
పెరుగుతున్న ఉల్లి క్రయవిక్రయాలు.. క్వింటా ధర ఎంతంటే..?
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇక్కడ ఉల్లికి లభించే గరిష్ఠ, కనిష్ఠ ధరలే.. ఉమ్మడి జిల్లాలో ఉల్లి ధరలను నిర్ణయిస్తాయి. ఇవాళ ఉదయం క్వింటా రూ. 1600 నుంచి రూ.2350 అమ్ముడయింది. చిరు వ్యాపారులతో సహా వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఉల్లి దిగుమతి పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.