మహబూబ్నగర్ జిల్లాలో నూతన పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను ఆ శాఖ అధికారులు అందజేశారు. బుధవారం పంచాయతీ కార్యదర్శుల నియామక ఉత్తర్వులు జారీకి ఈసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యాక వారి నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. సొంత పంచాయతీల్లో మాత్రం పోస్టింగ్లు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ నియామకపత్రాల జారీ పక్రియ వేగవంతం కానుంది.
పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు - పంచాయతీ కార్యదర్శులు
మహబూబ్నగర్ జిల్లాలో నూతన పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైనవారికి నియామక పత్రాలను ఉన్నతాధికారులు అందించారు.
పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు