మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్థల పరిశీలన చేశారు. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో 15 ఎకరాలలో నర్సింగ్ కళాశాలను నిర్మిచేందుకు నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలతో పాటు ఇతర సంబంధిత కళాశాలలు రావడం సంతోషకరంగా ఉందన్నారు. హైదరాబాదులో ఉన్నట్లుగానే మహబూబ్‌నగర్‌లో కూడా వివిధ ప్రాంతాల్లో చిన్న పిల్లలు, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రితో పాటు ఇతర ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
'వైద్యరంగంలో మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతా' - మహబూబ్‌నగర్‌లో నర్సింగ్ కాలేజీ
వైద్యరంగంలో మహబూబ్‌నగర్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు నూతనంగా మంజూరైన నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు భూమిని జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలోని పాత కలెక్టరేట్ భవనం వద్ద 10 ఎకరాల ప్రాంగణంలో నూతన ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సూచించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని భూములు ఉన్నాయో అవన్నీ ఒకే రిజిస్టార్లో నమోదు చేయాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులను, 9 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు.
ఇదీ చూడండి:Corona Vaccine: పోలీసు శాఖలో ఫలిస్తున్న టీకా మంత్రం