తెలంగాణ

telangana

ETV Bharat / state

అందర్ని అనడం సమంజసం కాదు - mbnr

శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో వీఆర్వోలు నిరసన చేపట్టారు.

వీఆర్వోల నిరసన

By

Published : Aug 2, 2019, 6:26 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీఆర్వోలు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. వర్షంలోనే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వీఆర్వోలకు అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. వ్యవస్థలో ఎవరో ఒకరు తప్పు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్వోలపై చెడు ముద్ర వేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్​సైట్​లో లోపాలు ఉండటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ముందుగా వాటిని సరి చేయాలని సూచించారు.

వీఆర్వోల నిరసన

ABOUT THE AUTHOR

...view details