తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 4:05 PM IST

ETV Bharat / state

జిల్లాకు త్వరలోనే ఎనర్జీ పార్కు.. విదేశాల నుంచి పెట్టుబడులు

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనర్జీ పార్క్​ను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఎనర్జీ పార్క్​లో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారని మంత్రి అన్నారు. మహబూబ్‌నగర్​లో ఏర్పాటు చేసిన కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

energy-park-coming-soon-to-the-mahabubnagar-district-investments-from-foreign-companies
జిల్లాకు త్వరలోనే ఎనర్జీ పార్కు.. విదేశాల నుంచి పెట్టుబడులు

మహబూబ్‌నగర్ పురపాలక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. తెరాసకు చెందిన నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి మంత్రి నియమాక పత్రాలను అందజేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలో వెయ్యి ఎకరాల్లో పుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు.. అందుకు సంబంధించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం పూర్తైందని మంత్రి తెలిపారు. పుడ్‌ పార్క్​లో మహిళలు పరిశ్రమలు పెట్టుకునే విధంగా కృషి చేయాలని కోరారు. వివక్షకు గురైన మహబూబ్‌నగర్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టాలన్నారు. అందుకు అనుగుణంగా పుర కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు కృషి చేయాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి :సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details