తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో పంజా విసురుతోన్న కరోనా

ఉమ్మడి పాలమూరులో కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 345 మందికి కొవిడ్‌-19 నిర్ధరణ అయింది.

ఉమ్మడి పాలమూరులో పంజా విసురుతోన్న కరోనా
ఉమ్మడి పాలమూరులో పంజా విసురుతోన్న కరోనా

By

Published : Aug 6, 2020, 1:13 PM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 345 మందికి కొవిడ్‌-19 నిర్ధరణ అయింది. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 151 మందికి పాజిటివ్‌ రాగా.. మహబూబ్‌నగర్‌ 73, వనపర్తి 57, నాగర్‌కర్నూల్‌ 53, నారాయణపేటలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జోగులాంబ గద్వాలలో 151...

జొగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 151 కేసులు నమోదు కావడం వల్ల జిల్లాలో కలవరం మొదలైంది. జిల్లా కేంద్రంలో 18, అలంపూర్‌ మండలంలో 30, అయిజలో 23, మానవపాడు 11, ధరూరు 10, గట్టు 10, మల్దకల్‌ 9, ఇటిక్యాల 8, వడ్డేపల్లి 6, రాజోలిలో ముగ్గురుతో పాటు జిల్లాలో మరో 23 మంది కరోనా బారినపడ్డారు.

మహబూబ్ నగర్ లో 73...

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 73 కేసులు నమోదు కాగా... జిల్లా కేంద్రంలోనే 41 మంది కొవిడ్ బారిన పడ్డారు. అత్యధికంగా మర్లు, రాజేంద్రనగర్‌, బోయపల్లిగేటు, టీచర్స్‌కాలనీ, షాసాబ్‌గుట్ట, ఏనుగొండ తదితర కాలనీల్లో ఇవి నమోదయ్యాయి. జడ్చర్ల, బాదేపల్లిలో 18, రాజాపూర్‌ 3, దేవరకద్ర, భూత్పూరు, మూసాపేటలో ఇద్దరేసి చొప్పున కరోనా బారిన పడ్డారు. కోయిల్‌కొండ, బాలానగర్‌, హన్వాడ, నవాబుపేట, గండీడ్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా సోకింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొవిడ్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు.

వనపర్తిలో 57...

వనపర్తి జిల్లాలో 57 మంది కరోనా బారిన పడగా.. జిల్లా కేంద్రానికి చెందిన వారే 38 మంది న్నారు. ఆత్మకూరు 4, చిన్నంబావి, పెబ్బేరు, వీపనగండలలో ముగ్గురు చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తకోటలో ఇద్దరు, మదనాపురం, పాన్‌గల్‌, రేవల్లి, పెద్దమందడిలో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

నాగర్‌కర్నూల్‌ లో 53...

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 53కి నిర్ధరణ కాగా.. జిల్లా కేంద్రంతో పాటు మండల పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. కొల్లాపూర్‌ 9, కల్వకుర్తి, తాడూరులో 8 చొప్పున.. తిమ్మాజిపేటలో 4, అచ్చంపేటలో 3, అమ్రబాద్‌, వెల్దండలో ఇద్దరు, బిజినేపల్లి, చారకొండ, తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి, ఊర్కొండలో ఒక్కొక్కరి చొప్పున కరోనా బారిన పడ్డారు.

నారాయణపేటలో 11...

నారాయణపేట జిల్లాలో 11 కేసులు నమోదు కాగా.. నలుగురు జిల్లా కేంద్రానికి చెందగా.. ఉట్కూరులో ముగ్గురు, దామరగిద్ద, మద్దూరు, మరికల్‌, మక్తల్‌ మండలాల్లో ఒక్కో కొవిడ్‌ కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details