లాక్డౌన్ కారణంగా అనేక మంది రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 వేల మంది క్యాబ్ డ్రైవర్లు కార్లనే నమ్ముకుంటూ జీవనం సాగించేవారు. కానీ ప్రస్తుతం రోజూ పని లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఏ సాయం అందలేదన్నారు. దిల్లీ సీఎం డ్రైవర్లకు నెలకు రూ. 5 వేల సాయం చేశారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఆదుకోవాలని కోరుతున్నారు.
మమ్మల్ని కూడా ఆదుకోండి..క్యాబ్ డ్రైవర్ల వేడుకోలు..
వాహనాల చక్రం ముందుకు కదిలితేనే.. వారి బతుకు చక్రం ముందుకు కదులుతుంది. అలాంటిది నెల రోజులుగా వాహనాన్ని నడిపింది లేదు.. చక్రం తిప్పిందీ లేదు. సాధారణ రోజుల్లోనే అరకొర జీతంతో నెట్టుకొచ్చే కారు డ్రైవర్లు.. లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 10 వేల మంది క్యాబ్ డ్రైవర్ల కష్టాలపై మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
మమ్మల్ని కుడా ఆదుకోవాలని ఆవేదన