మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. వరుసగా కురుస్తోన్న వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో దినదిన గండంగా గడుపుతున్నవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి: భాజపా
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో దినదిన గండంగా గడుపుతున్న బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి: భాజపా
ప్రభుత్వం తక్షణం స్పందించి, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. బాధితులతో పాటు భాజపా జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నంబి రాజు, కురువ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.