తెలంగాణ

telangana

ETV Bharat / state

'తప్పును సరిదిద్దుకున్న వాళ్లే మహాత్ములు' - 'తప్పును సరిదిద్దుకున్న వాళ్లే మహాత్ములు'

చెడు వ్యసనాలకు బానిస కాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని జిల్లా న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ జీవీ సుబ్రమణ్యం యువతకు పిలుపునిచ్చారు. యవ్వనంలోనే చెడు వ్యసనాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతారని ఈ సమయంలోనే దృష్టిని... బంగారు భవిష్యత్తు దిశగా కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

'తప్పును సరిదిద్దుకున్న వాళ్లే మహాత్ములు'

By

Published : Nov 2, 2019, 11:08 PM IST

Updated : Nov 2, 2019, 11:31 PM IST

మహబూబ్​నగర్​లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నిర్మూలన, యాసిడ్ దాడి బాధితులకు న్యాయ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి జస్టిస్ జీవీ సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తప్పులు చేయడం మానవ సహజమన్న న్యాయమూర్తి.. ఆ తప్పును సరిదిద్దుకుని జీవితాన్ని నిలబెట్టుకున్న వాళ్లే గొప్పవాళ్లని హితవు పలికారు. యాసిడ్ దాడులకు గురైనవారు గుండెనిబ్బరంతో తిరిగి జీవితంలో నిలదొక్కుకోవాలని మనోధైర్యం కల్పించారు.

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఇన్​ఛార్జి ఎస్పీ చేతన వివరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటే యోగా, మంచివాళ్లతో స్నేహం సహా సద్గుణాలు అవలవరచు కోవాలని ప్రత్యేక అధికారిణి క్రాంతి సూచించారు. యాసిడ్ దాడులకు గురైన బాధితులు జీవితంలో కుంగిపోకుండా..ధైర్యంగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.

'తప్పును సరిదిద్దుకున్న వాళ్లే మహాత్ములు'

ఇదీ చూడండి : బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా...!

Last Updated : Nov 2, 2019, 11:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details