మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి.. సుష్మ సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. సుష్మాస్వరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె లేని లోటు ఎవరు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్చర్లలో సుష్మస్వరాజ్‌కు ఘననివాళి - జడ్చర్ల
కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భాజపా నాయకులు ప్రార్థించారు. జడ్చర్లలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జడ్చర్ల