తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో 3వేలు దాటిన కరోనా కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. మార్చి 29న మొదటి కేసు నమోదు కాగా.. 500 కేసులు చేరుకునేందుకు మూడున్నర నెలలు పట్టింది. ఇప్పుడు 3231 కేసులకు చేరుకుంది.

ఉమ్మడి పాలమూరులో 3వేలు దాటిన కరోనా కేసులు
ఉమ్మడి పాలమూరులో 3వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 5, 2020, 10:54 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3వేలు దాటింది. మార్చి 29న మొదటి కేసు నమోదు కాగా.. 500 కేసులు చేరుకునేందుకు మూడున్నర నెలలు పట్టింది. ఇప్పుడు 3231 కేసులకు చేరుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,050, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 819, జోగులాంబ గద్వాల జిల్లాలో 715, వనపర్తి జిల్లాలో 446, నారాయణపేట జిల్లాలో 201 కొవిడ్‌- 19 కేసులు నమోదయ్యాయి.

తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లాలో 224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యదికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 86 కేసులు నమోదవగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 64, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 34, వనపర్తి జిల్లాలో 32 మంది, నారాయణపేట జిల్లాలో ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు.

జోగులాంబ 86

జోగులాంబ గద్వాల జిల్లాలో 86 మంది కరోనా బారిన పడగా.. గద్వాల పట్టణంలోనే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలంపూర్ మండలంలో 19, అయిజలో 12, ధరూరు, ఉండవల్లి మండలాల్లో ఏడుగురు చొప్పున.. మిగతా మండలాల్లో 16 మంది కరోనా బారిన పడ్డారు.

మహబూబ్ నగర్ 64

మహబూబ్‌నగర్ జిల్లాలో 64 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మహబూబ్‌నగర్‌ పురపాలిక పరిధిలో 25, గ్రామీణ మండల పరిధిలో నలుగురు కరోనా బారిన పడ్డారు. జడ్చర్ల, బాదేపల్లిలో 22 మంది కొవిడ్‌ బారిన పడగా.. బాలానగర్‌, మిడ్జిల్‌, భూత్పూర్‌ మండలంలో ముగ్గురికి చొప్పున కరోనా నిర్ధరణ అయ్యింది. హన్వాడలో 2, జానంపేట, నవాబుపేట మండలాల్లొ ఒక్కొక్కరు కొవిడ్‌ బారిన పడ్డారు

నాగర్ కర్నూల్ 34

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మండలాల వారిగా కల్వకుర్తిలో 9, బిజినేపల్లిలో 7, కొల్లాపూర్‌లో5, అచ్చంపేటలో, తాడూరులో ముగ్గురు చొప్పున, పెంట్లవెల్లి, వెల్దండలో ఇద్దరు చొప్పున, నాగర్‌కర్నూల్‌, పదర, అమ్రబాద్‌ మండల పరిధిలలో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.

వనపర్తి 32..

వనపర్తి జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వనపర్తి పట్టణంలో 13 మంది, కొత్తకోటలో 6 మంది, పెబ్బేరులో నలుగురు, ఆత్మకూరులో ముగ్గురు, మదనపూర్‌లో ఇద్దరు, చిన్నంబావి, రేవల్లి, వీపనగండ్లలో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు.

నారాయణపేట జిల్లాలో 8 మంది కరోనా బారిన పడగా.. జిల్లా కేంద్రంలోనే 5, ఉట్కూరు, జాజాపూర్‌, కర్నేలో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details