మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పరగూడెం సర్పంచ్ భర్తను పెద్ద వంగర ఎస్సై బాణోత్ రామ్ చరణ్ చితకబాదాడు. లంచం ఇవ్వనందుకే తనపై దాడి చేశాడని తెరాసకు చెందిన సర్పంచ్ భర్త సమ్మయ్య ఆరోపించారు. తీవ్ర గాయాలయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
'లంచం ఇవ్వలేదని సర్పంచ్‌నే కొట్టిన ఖాకీ'
లంచం ఇవ్వనందుకే తనపై పెద్ద వంగర ఎస్సై దాడి చేశాడని ఓ సర్పంచ్ భర్త ఆరోపించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో జరిగింది.
'లంచం ఇవ్వలేదని సర్పంచ్‌నే కొట్టిన ఖాకీ'
గ్రామానికి చెందిన ఓ పంచాయతీ విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సర్పంచ్‌ను నువ్వెందుకు వచ్చావని ఎస్సై రామ్‌చరణ్ చితకబాదాడు. ఎస్సై రామ్ చరణ్‌కు లంచం ఇవ్వలేదనే తనపై దాడి చేశాడని సమ్మయ్య ఆరోపించారు. తనను పలుమార్లు లంచం ఆడిగేవాడని, పెద్ద వంగర పోలీస్‌స్టేషన్‌లో లంచంగా డబ్బులిస్తేనే పని అవుతుందని బాధితుడు సమ్మయ్య తెలిపాడు.
ఇదీ చూడండి : 'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'