రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే.. ప్రమాదాల శాతం తగ్గించవచ్చంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత గురించి తెలియజేస్తూ మదర్ థెరిస్సా విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు కళాబృందాలతో ఆటో ర్యాలీ నిర్వహించారు.
రవాణా శాఖాధికారి భద్రునాయక్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినా.. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. అలాగే.. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు.