మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పెద్ద చెరువు ఎస్సారెస్పీ జలాలతో నిండి మత్తడి పోస్తోంది. వరద నీరంతా దిగువకు వెళ్తోంది. దీంతో చేతికొచ్చిన పంటపొలాలు జలమయమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునగినందున... ఆయకట్టు రైతులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు... తర్వాత కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసుకున్నారు.
ఎస్సారెస్పీ జలాలు ఎక్కువై.. నీట మునిగిన పంట పొలాలు
నీరు లేకున్నా... నీరెక్కువైనా... పంట ఇంటికి చేరేదాకా నమ్మకం లేదని... మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ జలాలతో పెద్ద చెరువు నిండి... ఆయకట్టు పొలాలు జలమయమయ్యాయి.
కల్వకుర్తిలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం
TAGGED:
paddy float in srsp water