మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఎంపీ మాలోత్ కవిత వందమంది పేద ముస్లిం మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచారు. లాక్డౌన్ సమయంలో రంజాన్ మాసం పాటిస్తున్న ముస్లింలు ఇబ్బంది పడకుంటా నిత్యావసరాలు పంచుతున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు రావడం పేదవాళ్లకు ఇబ్బందే అన్నారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ముగిసేవరకు అల్లా దయతో కరోనా పూర్తిగా తగ్గిపోవాలని ఆమె కోరుకున్నారు. ఎంపీతో పాటు జిల్లా కో ఆప్షన్ సభ్యుడు పాషా, తెరాస నాయకులు ఈ పంపిణీలో పాల్గొన్నారు.
ముస్లింలకు సరుకులు పంచిన ఎంపీ మాలోత్ కవిత - Mp Maloth Kaviitha Distributes Groceries to Muslim Womens
లాక్డౌన్ కారణంగా రంజాన్ సమయంలో ముస్లింలు ఇబ్బంది పడకూడదన్నారు ఎంపీ మాలోత్ కవిత. మహబూబాబాద్‌లోని తన స్వగృహంలో ఆమె పేద ముస్లింలకు నిత్యవసరాలు పంచారు.
ముస్లింలకు సరుకులు పంచిన ఎంపీ మాలోత్ కవిత
TAGGED:
ab