రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కరోనా కిట్లను పంపిణీ చేశారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మెడికల్ కళాశాలను మంజూరు చేశారని అన్నారు. మరికొన్ని కళాశాలలను మంజూరు చేయనున్నారని వెల్లడించారు.
trs: 'ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం'
కరోనా విపత్కర కాలంలోనూ సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధిని వివరించారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్, కరోనా కిట్లు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలను 30శాతం పెంచారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Loan app case: తెరవెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు