మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్ మండలాల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయా మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. డోర్నకల్ మండలం మన్నెగూడెంలో నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే రెడ్యానాయక్
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ శాసన సభ్యులు రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్ మండలాల్లోని రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే రెడ్యానాయక్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఏకధాటి వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం