మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తానే స్వయంగా రోడ్ల ఇరువైపులా రసాయనాలను పిచికారీ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా తొర్రూరు పట్టణంలోని అన్ని రోడ్లని శానిటేషన్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు రేపు 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని, ఎవరు దీనిని రాజకీయం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.
తొర్రూరులోని రోడ్లను శానిటేషన్ చేసిన మంత్రి ఎర్రబెల్లి - మహబూబాబాద్ జిల్లా
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు రేపు రాత్రి 9గంటలకు అందరూ దీపాలు వెలిగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. మహబూబాబాద్ తొర్రూరులోని రోడ్లపై ఆయన రసాయనాలను పిచికారీ చేశారు.
![తొర్రూరులోని రోడ్లను శానిటేషన్ చేసిన మంత్రి ఎర్రబెల్లి Minister Yerrabelli Dayakar Rao spraying chemicals on Mahabubad Turrur roads](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6662210-996-6662210-1586008023606.jpg)
తొర్రూరులోని రోడ్లను శానిటేషన్ చేసిన మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ వ్యకిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తొర్రూరులోని రోడ్లను శానిటేషన్ చేసిన మంత్రి ఎర్రబెల్లి
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్