మనిషి చేయలేని, కనిపెట్టలేని అనేక విషయాలను కనుగొని పోలీసులకు ఆయుధంగా పనిచేస్తున్న మహబూబాబాద్ పోలీస్ కార్యాలయంలోని పోలీస్ జాగిలానికి లియో అని ముద్దుగా పిలుచుకుంటారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ పోలీస్ కార్యాలయం నుంచి మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి దానిని తీసుకొచ్చారు.
మానవత్వం చాటిన పోలీసులు.. జాగీలానికి కన్నీటి నడుమ అంత్యక్రియలు - latest news of mahabubabad
కరోనా వేళ మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే అయిన వారు, బంధువులు చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. వారి శవాలను గుట్టల్లో... పుట్టల్లో ఖననం చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటుండగా మరోవైపు మహాబూబాబాద్ జిల్లా పోలీసులు మాత్రం అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలానికి లాంఛనాలతో అశ్రు నయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
మానవత్వం చాటిన పోలీసులు.. జాగీలానికి కన్నీటి నడుమ అంత్యక్రియలు
లియో మందుపాతరలను గుర్తిస్తూ పలు బందోబస్తుల్లో విధులు నిర్వహించి శభాష్ అనిపించుకుంది. కాగా ఆ జాగీలం జీవితకాలం 10 సంవత్సరాలు కాగా అనారోగ్యం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించింది. అయితే లియో మృతితో ఏఆర్ డీఎస్పీ జనార్దన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. జాగిలమేకదా అని తీసి అవతల పడేయకుండా దాన్ని గౌరవించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు