తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో భూనిర్వాసితుల ఆందోళన - Land expatriates protest

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో వల్లూరు నుంచి మహబూబాబాద్​ కలెక్టరేట్​ వరకు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఉదండాపూర్​ జలాశయంలో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు.

land-expatriates-protest-at-mahabubabad-collectorate
కాంగ్రెస్​ ఆధ్వర్యంలో భూనిర్వాసితుల ఆందోళన

By

Published : Mar 11, 2020, 3:27 PM IST

ఉదండాపూర్​ జలాశయంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ.. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో వల్లూరు నుంచి మహబూబ్​నగర్​ కలెక్టరేట్​ వరకు కాంగ్రెస్​ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ పీసీసీ కార్యదర్శి అనిరుధ్​రెడ్డి ఆధ్వర్యంలో వల్లూరు, ఉదండాపూర్​, తీగలపల్లి, కాకర్లపాడు మీదుగా మహబూబ్​నగర్​ కలెక్టరేట్​కు పాదయాత్రగా వెళ్లారు.

పాదయాత్ర సమాచారం అందుకున్న పోలీసులు తొలుత కొంతమంది కాంగ్రెస్​ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వల్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభం చేశారు. ఉదండాపూర్​ జలాశయ బాధితులకు ఎకరాకు 12 లక్షలు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇండ్ల స్థలాలు పరిహారం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ అమలు చేయాలని అన్ని రకాల పరిహారాలు ఏకకాలంలో చెల్లించాలని వారు డిమాండ్​ చేశారు. మరోవైపు ఉదండపూర్​ జలాశయం నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి.

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో భూనిర్వాసితుల ఆందోళన

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ABOUT THE AUTHOR

...view details