- ఆదాయం- 2
- వ్యయం- 14
- రాజపూజ్యం-2
- అవమానం 2
విశేషమైన శుభాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయంగా మార్చుకుంటే జీవితంలో పైకి వస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. మీవల్ల కొందరికి మేలు చేకూరుతుంది.