విత్తనాల దుకాణంలో ఓ కంపెనీకి చెందిన మిరప విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కాయలు ముడత పడ్డాయి. పంట సాగు చేసిన రైతులు నష్టపోయమని తెలుసుకుని ఆందోళన చేపట్టారు.
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణం ముందు రైతుల ఆందోళన
నకిలీ విత్తనాలతో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని విత్తనాల దుకాణం ముందు బైఠాయించి రైతులు ఆందోళన చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో చోటుచేసుకుంది.
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణం ముందు రైతుల ఆందోళన
ఎవరూ ఆ పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు విత్తనాల దుకాణం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. నకిలీ విత్తనాల కారణంగా అన్యాయం జరిగిందని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'