తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన సంవత్సరం సంబురాల్లో పాల్గొన్న జిల్లా ఎస్సీ - telangana news

నూతన సంవత్సరం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రధాన కేంద్రాలలో బందోబస్తు నిర్వహించారు. ముత్యాలమ్మ గుడి కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

District Sp participating in New Years party at mahabubabad
నూతన సంవత్సరం సంబురాల్లో పాల్గొన్న జిల్లా ఎస్సీ

By

Published : Jan 1, 2020, 11:27 AM IST

కొత్త సంవత్సరం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి కేంద్రం​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలు కాలనీలలో ప్రజలు డీజే పాటలకు స్త్రీ, పురుషులు, చిన్నా, పెద్దా తేడా లేకుండా నృత్యాలు చేశారు.

2019 ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా గడిచిపోయిందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూశారని ఎస్పీ అన్నారు. 2020లో కూడా అదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేష్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సంబురాల్లో పాల్గొన్న జిల్లా ఎస్సీ

ఇదీ చూడండి : ఇవాళ్టి నుంచి భాగ్యనగరంలో నుమాయిష్ జోష్ ​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details