మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు. ఖాజీపేట - భద్రాచలం రహదారి మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి, పుష్ఫుల్ రైళ్లల్లో సౌకర్యాలను మెరుగుపరచాలంటూ నినాదాలు చేశారు. రైల్వే డీఆర్ఎంకు ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలను అందించినా సమస్యలను పరిష్కరించడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా - రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా
ఖాజీపేట - భద్రాచలం రహదారి మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం ధర్నా చేపట్టాయి.
రైల్వే స్టేషన్ ముందు సీపీఎం శ్రేణుల ధర్నా
TAGGED:
సీపీఎం ధర్నా