విద్యార్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్ - congress
ఇంటర్ ఫలితాల్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్, జేఏసీ, ఎన్ఎస్యూఐ నాయకులు వినతి పత్రం అందించారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిని శిక్షించాలని కోరారు.
కలెక్టర్ కార్యాలయం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన బోర్డు, గ్లోబరిన్ ఐటీ కంపెనీపై సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కి వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి న్యాయం చేకూరేలా చేయాలన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.