కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పోచన్న కుమారుడు ప్రభుదాస్ గత కొద్ది రోజులుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రభుదాస్ ఈరోజు ఉదయం 4 గంటలకు మృతి చెందాడు. ప్రభుదాస్తల్లితండ్రులుకుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు . దిందా గ్రామానికి ముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు ఇటీవల వర్షాలకు ఉప్పొంగడం వల్ల అంబులెన్స్ వాగును దాటలేని పరిస్థితి నెలకొంది. ఆ తల్లి తండ్రులు చేసేదేమీ లేక బంధువుల సహాయంతో మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటించారు.
మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు - దిందా గ్రామం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పోచన్న కుమారుడు ప్రభుదాస్ ఇవా ళ ఉదయం కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లెందుకు సుమారు 2 కిలో మీటర్ల దూరం వాగులో మోసుకుంటూ వెళ్లారు.
మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు..!