తెలంగాణ

telangana

ETV Bharat / state

2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత - ఆబ్కారీ పోలీసులు

2 లక్షల 56 వేల విలువైన బెల్లం, పటికను కుమురం భీం జిల్లా లంబడి హెట్టి వద్ద ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్​ చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత

By

Published : Oct 23, 2019, 9:21 PM IST

2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత
కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం లంబడి హెట్టి వద్ద 2 లక్షల 56 వేల విలువ గల బెల్లం, పటికను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని గోండ్​ పిప్పిరి నుంచి లంబడి హెట్టి గ్రామానికి తరలిస్తున్న క్రమంలో వాహనాలను తనిఖీ చేయగా 2 వేల 800 కిలోల బెల్లం, 400 కిలోల పటిక పట్టుబడింది. సామగ్రిని స్వాధీన పర్చుకొని బొలెరో వాహనాన్ని సీజ్​ చేశారు. హెట్టి గ్రామానికి చెందిన అజమేర శ్రీకాంత్​, జరుపుల శంకర్​ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎక్సైజ్​ సీఐ మహేందర్​ సింగ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details