తెలంగాణ

telangana

ETV Bharat / state

గోలేటి రేషన్​షాపు డీలర్​పై ఫిర్యాదు.. - లబ్ధిదారులు

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా గోలేటిలోని రేషన్​ షాపు డీలర్​పై.. తమకు ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం ఇవ్వడంలేదని లబ్ధిదారులు జిల్లాపాలనాధికారికి ఫిర్యాదు చేశారు. తనిఖీ నిర్వహించిన ఎన్ఫోర్స్​మెంట్​ డీటీ శ్యామ్​లాల్​ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామని తెలిపారు.

The beneficiary alleges and complained that the ration shop dealer of not giving rice in kumuram bheem asifabad
గోలేటి రేషన్​షాపు డీలర్​పై ఫిర్యాదు..

By

Published : Apr 16, 2020, 2:19 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి ప్రాంతంలోని రేషన్ దుకాణం డీలర్ విజయ తనకు బియ్యం ఇవ్వడం లేదని రమేశ్​ అనే లబ్ధిదారుడు ఆరోపించాడు. జిల్లా పాలనాధికారి, రెబ్బెన తహసీల్దార్​కు అతను ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తాను​ కూలీ పని నిమిత్తం మాదారంలో నివాసం ఉంటున్నానని బియ్యం తీసుకోడానికి వస్తే అతనికి బదులు అంతకుముందే బియ్యాన్ని వేరే వాళ్లు తీసుకున్నట్టుందని అతను వాపోయాడు.

ఇదే తరహాలో గోలేటికి మరో కుటుంబంలోని ఒకరికి రేషన్​ ఇవ్వలేదని వారు ఆరోపించారు. వారు కూలీపనుల నిమిత్తం బెల్లంపల్లిలో ఉంటున్నామని.. తమ కుటుంబంలో మొత్తం ఐదుగురు లబ్ధిదారులు ఉండగా కేవలం నలుగురికి 12 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి.. ఇంకొకరికి ఇవ్వాల్సి ఉందని డీలర్​ను అడగగా ఇచ్చేది లేదని ​డీలర్ విజయ అన్నారని వారు పేర్కొన్నారు.

ఫిర్యాదు అందుకున్న ఎన్ఫోర్స్​మెంట్​ డీటీ శ్యామ్​లాల్.. గోలేటిలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. పూర్తి దర్యాప్తు నిర్వహించి సమాచారాన్ని పౌరసరఫరాల అధికారులకు అందజేస్తామని.. తప్పొప్పులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు ఆయన​ తెలిపారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details