ఆసిఫాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఇష్టానుసారంగా పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా సామాగ్రి తీసుకువచ్చి ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌పై వేదింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపాలని కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టినట్లు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు.
కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా