హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పనులు చేసుకునే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది వలస కూలీలు కుమురంభీం జిల్లా కాగజ్ నగర్లో చిక్కుకుపోయారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం సరిహద్దులు దాటకూడదని అధికారులు ఆంక్షలు విధించారని తెలిపారు. తాము సొంతూర్లకు వెళ్లేందుకు అనుమతించాలని కోరేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.
గత నెల రోజులుగా పిల్ల పాపలతో ఇక్కడే ఊరి పొలిమేరల్లో ఉంటున్నామని, ప్రభుత్వం తరపున కేవలం ఒకరికి 5కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో పాటు చేతిలో డబ్బులు కూడా ఖర్చయ్యాయని.. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండగలమని వారు వాపోయారు. ఇకనైనా అధికారులు తమను స్వస్థలాలకు పంపించాలని వేడుకుంటున్నారు.
కాగజ్‌నగర్‌లో వలస కూలీల ఆవేదన - corona virus latest news
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేయడం వల్ల వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రవాణా సౌకర్యం లేక కాలినడకనైనా సరే సొంతూర్లకు వెళదాం అనుకుంటే అధికారులు సరిహద్దుల్లోనే ఆపేసారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీలను పంపించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నామని చెబుతుంటే.. తమకు మాత్రం స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు.
కాగజ్‌నగర్‌లో వలస కూలీల ఆవేదన
ఇవీ చూడండి: వలస కార్మికుల ఆందోళన.. ఎమ్మెల్యే హామీతో విరమణ