లాక్‌డౌన్‌తో కాగజ్‌నగర్ పట్టణంలో కుటుంబ పోషణకు ఇక్కట్లు పడుతున్నపేదలకు దాతలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. దాతల సహకారంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు, ఆహారం అందిస్తున్నారు.
భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు, ఆహారం అందిస్తున్నారు.
భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ప్రతిరోజు రైలు మార్గంలో, కాలినడకన వెళ్లే వలస కూలీలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 3250 మందికి సరకుల కిట్లు అందించామని, మరో 500 కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు శివ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'