కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి ప్రాణహిత నది వద్ద జలదీక్ష చేసేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు జలదీక్షలో పాల్గొంటామని ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి సమయంలో ముందస్తు అరెస్టులు చేశారు.
అడుగడుగునా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు - తుమ్మిడిహట్టి ప్రాజెక్టు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి ప్రాణహిత నది వద్ద జలదీక్ష చేయతలపెట్టిన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పీసీసీ పిలుపు మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జలదీక్ష చేయనున్నట్టు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ప్రకటన మేరకు పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.
రైతులు,ప్రజలకు ఉపయోగపడే తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది వద్ద చేపట్టిన జలదీక్ష కార్యక్రమాన్ని అరెస్టులు చేసి భగ్నం చేయడం అన్యాయమని.. విశ్వప్రసాద్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చవచ్చని తెలిపిన కేసీఆర్ మాటమీద నిలబడలేకపోయాడని ఆయన ఆరోపించారు. నిధులలో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు తెలిసిపోయిందని, నియామకాలు అనేవి.. కపట నాటకమని, ఇక నీళ్ల విషయానికొస్తే.. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వెంటనే ప్రాణహిత నదిపై చేపట్టాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించి మూడు టీఎంసీల నీళ్లను ఒక లక్షా 70 వేల ఆయకట్టుకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!