కుమురంభీం జిల్లా దహెగాం మండలం బిబ్ర గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. కొత్మిర్ గ్రామానికి చెందిన జాడి శంకర్ కౌసల్య దంపతులు తమ ఇద్దరు కుమారులు కార్తీక్, నికేశ్లతో కలిసి పెసరకుంటలోని తమ పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు - రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
కుమురంభీం జిల్లా దహెగాం మండలం బిబ్ర గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక బాలుడికి కాలు విరిగి పోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
నికేశ్కు కాలు విరిగి పోగా.. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్ ఎన్నిక వాయిదా